గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 11:32:10

తూర్పు లడఖ్‌ను సందర్శించనున్న ఆర్మీ చీఫ్‌

తూర్పు లడఖ్‌ను సందర్శించనున్న ఆర్మీ చీఫ్‌

లడఖ్ : రెండు రోజుల లడఖ్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారవానే  తూర్పు లడఖ్‌లోని ఫార్వర్ట్‌ ప్రదేశాలను బుధవారం సందర్శించి, మైదానంలో ఉన్న చైనా ఆర్మీ బలగాలతో కూడా సంభాషించనున్నట్లు ఆర్మీ సోర్స్‌ అధికారులు తెలియజేశారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి చైనీస్‌ మిలటరీతో చర్చల్లో పురోగతిని సమీక్షించడానికి మంగళవారమే ఆర్మీ చీఫ్‌ అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లడఖ్‌ ఎంపీ జంయాంగ్‌ టీసిరింగ్‌ నాంగయాల్‌ను  కలవనున్నారు. అదే విధంగా ఈ నెల 15న గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడి ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతున్న భారత ఆర్మీ సైనికులను కూడా ఆయన పరామర్శించనున్నారు. లడఖ్‌లో భద్రతా బలగాల గురించి  సోమవారం ఢిల్లీ ఆర్మీ అగ్ర సైన్యం అధికారులను నారవానే అడిగి తెలుసుకున్నారు. 


logo