గురువారం 02 జూలై 2020
National - May 05, 2020 , 18:55:13

పశ్చిమబెంగాల్‌లో ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే పర్యటన

పశ్చిమబెంగాల్‌లో ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే పర్యటన

కోల్‌కతా : చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే మంగళవారం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నరవాణే నేడు రాష్ట్రంలోని డార్జిలింగ్‌ జిల్లాలోని సుక్నా, జల్‌పాయ్‌గురి జిల్లాలోని బిన్నగురి, పశ్చిమ బర్దమాన్‌ జిల్లాలోని పనగడ్‌ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. శిక్షణా సదుపాయాలను పరిశీలించారు. సరిహద్దులో మోహరించిన భద్రతా సిబ్బందితో చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. కోవిడ్‌-19పై పోరాటంలో భారత ఆర్మీ స్థానికంగా అందిస్తున్న సేవలను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ క్లిష్ట సమయంలో విజయవంతంగా విధులు నిర్వర్తిస్తున్న అన్ని ర్యాంకుల అధికారులను నరవాణే అభినందించారు.


logo