బుధవారం 08 జూలై 2020
National - Jun 23, 2020 , 17:30:30

చైనా ఘర్షణలో గాయపడిన సైనికులకు ఆర్మీ చీఫ్‌ పరామర్శ

చైనా ఘర్షణలో గాయపడిన సైనికులకు ఆర్మీ చీఫ్‌ పరామర్శ

లేహ్‌: లఢక్‌కు వెళ్లిన భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే లేహ్‌లోని సైనిక దవాఖానను సందర్శించారు. గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన జవాన్లు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.  ఆ జవాన్లను పరామర్శించిన నరవాణే, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. రెండు రోజులపాటు లఢక్‌లో పర్యటించనున్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవాణే, లేహ్‌ సైనిక కేంద్రంలోని 14 కార్స్‌ అధికారులతో సమీక్ష జరుపుతారు. సరిహద్దు ఘర్షణపై చైనా అధికారులతో జరుగుతున్న చర్చల పురోగతిని ఆయన అడిగి తెలుసుకుంటారు.

జూన్‌ 15-16 తేదీల్లో లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతోసహా 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో సుమారు 70 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి పెరిగాయి.logo