ఆదివారం 12 జూలై 2020
National - Jun 23, 2020 , 12:55:21

లఢక్‌కు బయలుదేరిన ఆర్మీ చీఫ్‌

లఢక్‌కు బయలుదేరిన ఆర్మీ చీఫ్‌

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే మంగళవారం లఢక్‌కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో వెళ్లిన ఆయనకు ఆర్మీ అధికారులు వీడ్కోలు పలికారు. విమానం ఎక్కే ముందు జనరల్‌ నరవాణేకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. లేహ్‌ సైనిక కేంద్రానికి చేరుకున్న తర్వాత 14 కార్స్‌ అధికారులతో ఆయన సమీక్ష జరుపుతారు. చైనా అధికారులతో జరుగుతున్న చర్చల పురోగతిని ఆర్మీ చీఫ్‌ అడిగి తెలుసుకుంటారు. 

లఢక్‌ సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ బదయూరియా ఇటీవల లేహ్‌తోపాటు శ్రీనగర్‌ వైమానిక కేంద్రాలను రెండు రోజులపాటు రహస్యంగా సందర్శించారు. జూన్‌ 15-16 తేదీల్లో లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతోసహా 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి పెరిగాయి. దీంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌లు లఢక్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకున్నది.  



logo