గురువారం 28 జనవరి 2021
National - Dec 28, 2020 , 15:02:28

దక్షిణ కొరియాకు ఆర్మీ చీఫ్‌ నరవణే

దక్షిణ కొరియాకు ఆర్మీ చీఫ్‌ నరవణే

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్ ముకుంద్ నరవణే దక్షిణ కొరియాకు సోమవారం బయలుదేరారు. ఆ దేశంలో మూడు రోజులపాటు ఆయన పర్యటిస్తారని ఆర్మీ తెలిపింది. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. సియోల్‌లో యుద్ధ స్మారక చిహ్నం సందర్శన, ఆ దేశ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, రక్షణ సముపార్జన ప్రణాళిక పరిపాలన మంత్రితో నరవణే సమావేశమవుతారని వెల్లడించింది. గ్యాంగ్‌వాన్‌ ఇంజే కౌంటీలోని కొరియా సైనిక శిక్షణా కేంద్రం, డేజియోన్‌లోని ఏజెన్సీ ఫర్ డిఫెన్స్ డెవలప్‌మెంట్‌ను ఆయన సందర్శిస్తారని తెలిపింది. భారత్, దక్షిణ కొరియా మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి ఆర్మీ చీఫ్‌ పర్యటన దోహదపడుతుందని పేర్కొంది. కాగా కరోనా కాలంలో జనరల్‌ నరవణే విదేశాల్లో పర్యటించడం ఇది ఐదవది. ఇప్పటికే మయన్మార్‌, నేపాల్‌, యూఏఈ, సౌది అరేబియా దేశాల్లో ఆయన పర్యటించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo