ఆదివారం 12 జూలై 2020
National - Jun 24, 2020 , 14:16:35

చైనా ఘర్షణలో పాల్గొన్న సైనికులకు ఆర్మీ చీఫ్‌ ప్రశంస

చైనా ఘర్షణలో పాల్గొన్న సైనికులకు ఆర్మీ చీఫ్‌ ప్రశంస

లేహ్‌: భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవణే బుధవారం తూర్పు లఢక్‌లోని సరిహద్దు ప్రాంతలను సందర్శించారు. గల్వాన్‌ లోయ వద్ద చైనాతో ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడి పరిస్థితి, సైనిక సన్నద్ధతపై ఆర్మీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. చైనా ఘర్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లను ఆయన ప్రశంసించారు. వారికి ప్రశంసా బ్యాడ్జీలను బహూకరించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రోత్సహించారు. 

ఈ నెల 15-16 తేదీల్లో చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసింది. ఈ ఘర్షణలో 70 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవణే రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం లఢక్‌కు వెళ్లారు. లేహ్‌లోని సైనిక దవాఖానలో చికిత్స పొందుతన్న జవాన్లు ఆయన పరామర్శించారు. సరిహద్దులోని పరిస్థితిపై ఆర్మీ అధికారులతో సమీక్షించారు. logo