మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 19:15:39

చైనా సరిహద్దులోని సైనిక కేంద్రానికి ఆర్మీ చీఫ్‌

చైనా సరిహద్దులోని సైనిక కేంద్రానికి ఆర్మీ చీఫ్‌

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే చైనా సరిహద్దులోని తేజ్‌పూర్‌ సైనిక కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడి 4 కార్ప్స్ సైనిక స్థావరానికి ఆయన బయలుదేరినట్లు సైనిక వర్గాలు గురువారం తెలిపాయి. చైనా సరిహద్దులోని భద్రతా పరిస్థితులను ఆయన సమీక్షిస్తారని వెల్లడించాయి. చైనా సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భారత ఆర్మీ మోహరింపు గురించి అక్కడి ఆర్మీ అధికారులు జనరల్‌ ముకుంద్‌కు వివరిస్తారని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.logo