సోమవారం 03 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 09:41:01

భార‌త్‌-చైనా మ‌ధ్య ఐదో విడ‌త చ‌ర్చ‌లు

భార‌త్‌-చైనా మ‌ధ్య ఐదో విడ‌త చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ: ల‌ఢ‌క్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నెల‌కొన్న వివాదాలు, ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను నియంత్రించ‌డానికి  భార‌త్‌-చైనా మ‌ధ్య మ‌రోమారు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా నేడు తూర్పు ల‌ద్దాఖ్ మోల్డోలో క‌మాండ‌ర్ స్థాయి అధికారులు ఐదో విడ‌త సమావేశం కానున్నారు. ఫింగ‌ర్ ప్రాంతంలో చైనా త‌న బ‌ల‌గాల‌ను ఉపసంహ‌రించుకోవాల‌ని భార‌త్ కోరే అవ‌కాశం ఉన్న‌దని సైనిక వ‌ర్గాలు స‌మాచారం అందించాయి.  

స‌రిహ‌ద్దు వివాదాల‌పై ఇరు దేశాల మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు ద‌శ‌ల్లో సైనికాధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. మూడోవిడ‌త నిర్వ‌హించిన చ‌ర్చ‌లు 12 గంట‌ల‌కుపైగా సుదీర్ఘంగా కొన‌సాగాయి. 


logo