ఆదివారం 24 జనవరి 2021
National - Dec 09, 2020 , 21:36:07

ఆయుధాలతో బెదిరించి బంగారం షాపు లూఠీ

ఆయుధాలతో బెదిరించి బంగారం షాపు లూఠీ

పట్నా : బీహార్‌లోని దర్భాంగా జిల్లాలో పట్టపగలే సినీ ఫక్కీలో దుండగులు బంగారం షాపును లూఠీ చేశారు. ఆయుధాలతో బెదిరించి 14 కిలోల బంగారు ఆభరణాలతోపాటు రూ.2 లక్షల నగదు అపహరించారు. బుధవారం దర్భాంగాలోని ఓ జ్యువెలరీ షాపునకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో ప్రవేశించారు. దుకాణం యజమానిని బెదిరించి ఆభరణాలు, కౌంటర్‌లోని నగదుతో అపహరించారు. స్థానికులు వెంబడించినా దుండగులు చాకచక్యంగా తప్పించుకున్నారు. దుండగులు వీధుల గుండా పరుగులు తీసిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసులు బృందం రంగంలోకి దిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే దోపిడీ జరిగిందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo