శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 01:41:43

‘అర్జున’ గ్రహీతలకు ఆయుధచట్టం మినహాయింపు

‘అర్జున’ గ్రహీతలకు ఆయుధచట్టం మినహాయింపు

న్యూఢిల్లీ: అర్జున అవార్డు గ్రహీతలు, జాతీయ-అంతర్జాతీయ షూటింగ్‌ పోటీల్లో అవార్డుల గ్రహీతలు, క్రీడాకారులను ఆయుధాల చట్టంలోని కఠిన నిబంధనల నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. వీరు.. కాలిబర్‌ 0.22 (0.22 లాంగ్‌ రైఫిల్‌), 8 ఎంఎం కాలిబర్ల సామర్థ్యం గల సెంటర్‌ ఫైర్‌ రైఫిళ్లతోపాటు 9 ఎంఎం కాలిబర్ల సామర్థ్యం గల పిస్టళ్లు/ రివాల్వర్లు, 12 కాలిబర్ల షాట్‌ గన్‌లు కలిగి ఉండేందుకు అనుమతినిస్తూ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పున్యా సాలీలా శ్రీవాత్సవ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే, కేంద్ర క్రీడాశాఖ/ రాష్ట్ర రైఫిల్‌ అసోసియేషన్ల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. 


మాదక ద్రవ్యాల లావాదేవీలపై ఉక్కుపాదం: అమిత్‌షా

అక్రమంగా మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నా, స్మగ్లింగ్‌ చేసినా సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా నిలిపివేయడానికి అందుబాటులో ఉన్న చర్యలను పూర్తిగా సమీక్షిస్తామని బిమ్‌టెక్‌ దేశాల కూటమి ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌పై పోరు’ అనే అంశంపై జరుగుతున్న రెండు రోజుల సదస్సును ప్రారంభిస్తూ చెప్పారు.


logo