శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 30, 2020 , 19:12:38

ఆర్చర్ కపిల్‌కు కరోనా పాజిటివ్

ఆర్చర్ కపిల్‌కు కరోనా పాజిటివ్

పూణే : పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న నేషనల్ ఆర్చరీ క్యాంప్‌లో పాలుపంచుకుంటున్న‌ కపిల్‌కు కరోనా వైరస్ సోకింది. ఇక్క‌డ జ‌రిపిన క‌రోనా ప‌రీక్ష‌ల‌లో ఆయ‌న‌కు వైర‌స్ సోకిన‌ట్టుగా నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతానికి క‌పిల్‌కు తీవ్ర‌వైన ల‌క్ష‌ణాలు ఏమీ లేవు. క‌పిల్‌ ను వైద్య బృందం ప‌ర్య‌వేక్షిస్తున్నది. కపిల్ 18 రోజుల సెలవులో ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అమ‌లులోకి తెచ్చిన‌ ప్రామాణిక ఎస్ఓపీ ప్ర‌కారం ఆయ‌న తిరిగి శిబిరంలో చేరిన తరువాత పరీక్షించారు. ఈ నేపథ్యంలో క‌పిల్‌కు క‌రోనా నిర్ధార‌ణయింది. ప్ర‌స్తుతం ఆయ‌న క్వారంటైయిన్‌లో ఉన్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo