మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 21:18:42

వ‌ర్చువ‌ల్ విధానంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం

 వ‌ర్చువ‌ల్  విధానంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం

తిరుప‌తి : కరోనా మహమ్మారినేపథ్యంలో ఆలయాల్లో నిర్వహించే పూజాది కార్యక్రమాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాదు పండగలు, ఉత్సవాల నిర్వహణలోనూ అనేక మార్పులు వచ్చేశాయి. కోవిడ్ నిబంధనల్లో భాగంగా సామాజిక దూరం పాటించాల్సి రావడంతో అత్యంత వైభవంగా జరుపుకునే శ్రావణ మాస వ్రతాలను ఈ సారి వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. సిరుల త‌ల్లి తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జూలై 31వ తేదీ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు.

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం టికెట్లు పొందిన భ‌క్తులకు అందించే ప్ర‌సాదాల‌కు శుక్ర‌వారం పూజ‌లు నిర్వ‌హించి ఇండియా పోస్ట‌ల్ వారికి అందించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ భ‌క్తుల కోరిక మేర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌గా జూలై 22వ తేదీ సాయంత్రం నుంచి  ఆన్‌లైన్‌లో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌మాసం మొద‌టి శుక్ర‌వారం సంద‌ర్భంగా అమ్మ‌వారి మూల‌విరాట్టు పాద‌ప‌ద్మా‌ముల వ‌ద్ద ఉత్త‌రియం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షిత‌లు, కంక‌ణాలు ఉంచి ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించార‌న్నారు.

వీటిని జూలై 31వ తేదీలోపు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు పొందిన గృహ‌స్తుల చిరునామాకు చేర‌వేసేందుకు ఇండియా పోస్టల్‌వారికి అందించిన్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం రోజున టికెట్లు పొందిన వారి  గోత్ర నామాలు అర్చ‌క స్వాములు అమ్మ‌వారి మూల విరాట్టు పాదాల వ‌ద్ద ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. జూలై 31వ తేదీ ఉద‌యం 10నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్నిఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు జెఈవో తెలిపారు. వ్ర‌తంలో పాల్గొనే భ‌క్తులు అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర ‌నామాలు ప‌ఠించాల్సి ఉంటుంద‌న్నారు.  logo