బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 12:49:30

క‌రోనా నివార‌ణ‌పై ఏపీకి కేంద్ర బృందం

క‌రోనా నివార‌ణ‌పై ఏపీకి కేంద్ర బృందం

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంట‌న్న పాజిటివ్ కేసులు అంతంకంత‌కూ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ‌పై ఏపీకి కేంద్ర‌బృందం చేరుకుంది. వైర‌స్ వ్యాప్తిపై అధ్య‌య‌నం, నివార‌ణ చ‌ర్య‌ల‌కోసం ఈ బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో కేంద్ర‌బృందం స‌మావేశం అయ్యింది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. క‌ర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైర‌స్ విజృంభించడంపై ఆరా తీస్తోంది.


logo