ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 21:43:48

ఏప్రిల్ 15 త‌ర్వాతే అంత‌ర్జాతీయ విమానాల స‌ర్వీస్‌ల‌పై నిర్ణ‌యం: కేంద్రం

ఏప్రిల్ 15 త‌ర్వాతే అంత‌ర్జాతీయ విమానాల స‌ర్వీస్‌ల‌పై నిర్ణ‌యం: కేంద్రం

ఢిల్లీ: ఈ నెల 14తో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో 15 నుంచి అంతర్జాతీయ విమానాలను పునఃప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. ప‌లు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఇండియా వచ్చేందుకు ఏప్రిల్ 15 వరకు వేచి చూడక తప్పదని అన్నారు.  అటు దేశంలోని విదేశీయులను తీసుకెళ్లే విమానాలు తిరుగు ప్రయాణయంలో ప్రయాణికులను తీసుకురాబోవని స్పష్టం చేశారు. దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దేశంలోని తమ పౌరులను వెనక్కి తీసుకెళ్లేందుకు అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాల ప్రత్యేక విమానాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఆయా దేశాల పౌరులను తరలించేందుకు ఎయిరిండియా కూడా జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలకు తన సేవలను విస్తరించింది. దంతో పాటుగా కార్గో సేవ‌ల‌ను ర‌న్ చేయ‌నుంది.


logo