మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 23, 2020 , 01:49:40

ఆయుర్వేద ‘సర్జన్‌'లు!

ఆయుర్వేద ‘సర్జన్‌'లు!

న్యూఢిల్లీ: శల్య, శాలాక్య ఆయుర్వేద విభాగాల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రాక్టీషనర్లు పలు రకాల శస్త్రచికిత్సల్లో శిక్షణ పొందేందుకు, స్వతహాగా సర్జరీలు చేసేందుకు కేంద్రం అనుమతించింది. అపాయకరం కాని కణతుల తొలగింపు, ముక్కు, కన్ను సంబంధిత శస్త్రచికిత్సలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో నడిచే ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌' (సీసీఐఎం) ఆదివారం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాబితాలో 39 జనరల్‌ సర్జరీలు.. కన్ను, ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన 19 చికిత్సలు ఉన్నాయి. సీసీఐఎం బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ వైద్య జయంత్‌ దేవ్‌పూజారి స్పందిస్తూ.. ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌లలో గత 20 ఏండ్లుగా ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వాటికి చట్టబద్ధత కల్పించామని చెప్పారు. సీసీఐఎం నిర్ణయాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వ్యతిరేకించింది. వ్యవస్థలను కలగాపులగం చేసే తిరోగమన చర్య అని విమర్శించింది.