మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Aug 23, 2020 , 13:35:58

ఇండియాలో ఆపిల్ ఐ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్...? కొత్తగా 10 వేల కొలువులు...

 ఇండియాలో ఆపిల్ ఐ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్...? కొత్తగా 10 వేల కొలువులు...

ముంబై : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి మేడిన్ ఇండియా ఐఫోన్ 12ను అందుబాటులోకి తీసుకు రానున్నది. ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విస్ట్రోన్ (తైవాన్ కంపెనీ) ఇప్పటికే బెంగళూరు సమీపంలో ఐఫోన్ 12 ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభించినట్లుగా తెలుస్తున్నది. దీని ద్వారా కొత్తగా 10 వేల కొలువులు రానున్నాయి. గత కొంతకాలంగా చాలా కంపెనీలు భారత్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా భారత్‌లో తయారీ కోసం ప్రోత్సాహం ఇస్తున్నది. చైనాతో పాటు ఇతర  చెందిన 24 స్మార్ట్ ఫోన్ మొబైల్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి . తాజాగా ఐఫోన్ 12 ఉత్పత్తి ప్రక్రియను తైవాన్‌కు చెందిన విస్ట్రోన్ ఇప్పటికే ప్రారంభించింది.

అర్హత కలిగిన వారికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, అనుభవజ్ఞులతో పాటు ఫ్రెషర్స్‌కు త్వరలోనే మరిన్ని అవకాశాలు రానున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 12 కాంపొనెట్స్ ట్రయల్ ప్రొడక్షన్ చేపట్టిన విస్ట్రోన్ సెప్టెంబర్ నుంచి కమర్షియల్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. వీటి ఉత్పత్తి స్థానికంగా ఉండటంతో దిగుమతి పన్నులు 22 శాతం తగ్గడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసాపురలో గల ప్లాంటులో ఈ మేరకు ఐఫోన్ 12 కాంపోనెట్స్ ఉత్పత్తి మొదలైందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో విస్ట్రోన్ కంపెనీ దశలవారీగా పదివేల మంది ఉద్యోగాలు కల్పించే యోచనలో ఉంది.

ఇది బెంగళూరుకు సమీపంలో ఉంది. తమ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 12 సెప్టెంబర్ తర్వాత రానుందని ఇటీవలే ఈ అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ వెల్లడించిన విషయం తెలిసిందే. iPhone 12 (5G) ధర రూ.70,000గా ఉంటుందని అంచనా. ఇప్పటికే మన దేశంలో ఐఫోన్ 6S, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఐఫోన్ 11 ఉత్పత్తి చేసిన ఆపిల్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్ 12ను ఇక్కడే తయారు చేయాలని భావిస్తున్నది. బెంగళూరు ఇప్పటికే ఉన్న ప్లాంటులో iPhone SE (2020) తయారు చేస్తుంది. ఈ సెకండ్ జనరేషన్ ఎస్ఈ హ్యాండ్‌సెట్స్ ఏప్రిల్ నెలలో లాంచ్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న తక్కువ ధర ఐఫోన్ ఇది. ఖరీదు రూ.42,500. ఏప్రిల్-జూన్ నెలలో రూ.40,000కు పైగా ఖరీదైన మొబైల్ సేల్స్‌లో iPhone SE టాప్ 5లో ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo