సోమవారం 08 మార్చి 2021
National - Nov 30, 2020 , 17:26:15

స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్‌కు ఫైన్...ఇదే కారణం...!

స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్‌కు ఫైన్...ఇదే కారణం...!

ముంబై : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ జరిమానా విధించారు. ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీట్రస్ట్‌ అథారిటీ యాపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ (కోటి 20 లక్షల డాలర్లు)  ఫైన్ విధించింది. ఐఫోన్లకు సంబంధించిన తప్పుడు విధానాలే కారణమంటూ తన ప్రకటనలో పేర్కొంది. యాపిల్‌ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.. వాటర్‌ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని ఇటలీ యాంటీట్రస్ట్‌ అథారిటీ తెలిపింది. కంపెనీ డిస్‌క్లైమర్‌లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్‌ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదని కూడా పేర్కొన్నదని ఇది వినియోగదారులను మోసం చేయడమేనని యాంటీట్రస్ట్ అథారిటీ వెల్లడించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo