బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 13:04:20

క‌రోనాతో డిప్యూటీ క‌లెక్ట‌ర్ మృతి

క‌రోనాతో డిప్యూటీ క‌లెక్ట‌ర్ మృతి

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. హుగ్లీ జిల్లాలోని చంద‌న్ న‌గ‌ర్ స‌బ్ డివిజ‌న్ కు చెందిన డిప్యూటీ క‌లెక్ట‌ర్ దేబ్ ద‌త్తా రాయ్(38) క‌రోనాతో మృతి చెందారు. ఈ నెల మొద‌టి వారంలో ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌టంతో.. హోం క్వారంటైన్ లో ఉండాల‌ని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఆదివారం ఉద‌యం డిప్యూటీ క‌లెక్ట‌ర్ కు శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

ఈ క్ర‌మంలో రాయ్ ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తుండ‌గా సోమ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. క‌రోనా స‌మ‌యంలో హుగ్లీ జిల్లాకు రైళ్ల‌ల్లో వ‌చ్చిన కార్మికుల‌ను క్వారంటైన్ కు త‌ర‌లించే బాధ్య‌త‌ను దేబ్ ద‌త్తా రాయ్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు క‌రోనా సోకి ఉండొచ్చ‌ని వైద్యులు పేర్కొన్నారు. డిప్యూటీ క‌లెక్ట‌ర్ మృతి ప‌ట్ల బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సంతాపం తెలిపారు. మృతురాలి భ‌ర్త‌, నాలుగేళ్ల కుమారుడికి ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo