గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 17:50:21

చైనాకు గ‌ట్టి స‌మాధానం చెప్పాలి: కేజ్రివాల్

చైనాకు గ‌ట్టి స‌మాధానం చెప్పాలి: కేజ్రివాల్

న్యూఢిల్లీ: ల‌ఢ‌ఖ్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ మ‌రోసారి స్పందించారు. త‌మ పార్టీ దేశానికి, దేశ సైనికులకు ఎల్ల‌వేళ‌లా మ‌ద్ద‌తు నిలుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. 20 మంది భార‌త సైనికుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన చైనాకు గ‌ట్టి స‌మాధానం చెప్పి తీరాల‌న్నారు. చైనాపై క‌ఠిన చర్య చేప‌ట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. 

కాగా, గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల‌పై చ‌ర్చించ‌డానికి ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ఆప్‌కు ఆహ్వానం అంద‌లేదు. దీనిపై ఆ పార్టీ నేత సంజ‌య్ సింగ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోదీ స‌బ్‌కా సాత్ స‌బ్ కా వికాసం నినాదం ఉద్దేశం ఇదేనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మోదీ మాట‌ల్లోనే త‌ప్ప చేత‌ల్లో ఐక‌మ‌త్యం ఉండ‌ద‌ని సంజ‌య్ సింగ్ విమ‌ర్శించారు.      ‌


logo