సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 15:14:27

అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం

అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా చెలరేగిన ఘర్షణల్లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) ఆఫీసర్‌ అంకిత్‌ శర్మ(26)ను అత్యంత దారుణంగా అల్లరిమూకలు హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. శర్మ కుటుంబంలో అర్హులైన వారికొకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 

అంకిత్ శర్మ శరీరంపై 400కు పైగా కత్తిపోట్లు పొడిచి చంపేశారు. ఆ తర్వాత శర్మ మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశారు. గంటల తరబడి శర్మను ఓ ఆరుగురు వ్యక్తులు చిత్ర హింసలకు గురి చేసి ఉంటారని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 47కు చేరింది. logo