గురువారం 21 జనవరి 2021
National - Dec 25, 2020 , 18:53:31

రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

హైదరాబాద్‌ :  తమిళ సినీ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గుర‌య్యారు. తీవ్ర రక్తపోటుకు గురికావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుప‌త్రిలో చేరారు. సాయంత్రం రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. శనివారం ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రజనీకాంత్‌కు తోడుగా  ఆసుపత్రిలో ఆయన కుమార్తె ఉన్నారు. ఆయన పరామర్శించేందుకు వచ్చిన వారిని ఎవ్వరినీ ఆసుపత్రి వర్గాలు లోపలికి అనుమతించడం లేదు.  రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo