శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 18:11:26

క‌రోనాపై అవ‌గాహ‌న‌కు ఏపీ పోలీసుల వినూత్న పంథా

క‌రోనాపై అవ‌గాహ‌న‌కు ఏపీ పోలీసుల వినూత్న పంథా

అమ‌రావ‌తి: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. చాలామ‌టుకు జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితం అయ్యారు. కానీ కొంత‌మందికి మ‌త్రం క‌రోనా తీవ్ర‌త అర్థం కావ‌డంలేదు. లాక్‌డౌన్‌ను లెక్క‌చేయ‌డం లేదు. అవ‌స‌రం ఉన్నా, లేకున్నా రోడ్ల‌పైకి వ‌స్తూ పోలీసులకు చికాకు తెప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప‌ట్ట‌ణ పోలీసులు ప్ర‌జ‌ల‌కు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వినూత్న పంథా అనుస‌రిస్తున్నారు. స్థానిక‌ క‌ళాకారుల‌కు య‌మ‌ధ‌ర్మరాజు, చిత్ర‌గుప్తుడి వేశాలు వేసి, య‌ముడి పాత్ర‌దారికి క‌రోనా వైర‌స్‌ను పోలిన కిరీటం పెట్టి ప్ర‌జ‌ల మ‌ధ్య తిప్పుతున్నారు. తాను, క‌రోనా వైర‌స్‌న‌ని, మీ మ‌ధ్యే తిరుగుతున్నాన‌ని, రోడ్ల మీద‌కు వ‌స్తే ఏ క్ష‌ణ‌మైనా ఎత్తుకు పోతాన‌ని య‌ముడి పాత్ర‌దారి చేత మైకులో చెప్పిస్తూ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo