బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 12:39:19

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తొలివిడతలో నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. నామినేషన్ల ఉపసంహరణ 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు బరిలో ఉన్న అభ్యర్థుల ప్రకటన. 21వ తేదీన పోలింగ్‌ నిర్వహణ. 24వ కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. 

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నె 9వ తేదీన విడుదల కానుంది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. 14న నామినేషన్ల పరిశీలన. 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. 23న పోలింగ్‌ నిర్వహణ. 27న కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. 

రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..

గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. గ్రామపంచాయతీ ఫేజ్‌-1 ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. 17 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. 20న నామినేషన్ల పరిశీలన. 22న నామినేషన్ల ఉపసంహరణ. 27న పోలింగ్‌.. అదే రోజు సాయంత్రం ఫలితాల వెల్లడి. గ్రామపంచాయతీ ఫేజ్‌-2 ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 17న విడుదల కానుంది. 19 నుంచి 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. 22న నామినేషన్ల పరిశీలన. 24న నామినేషన్ల ఉపసంహరణ. 29న పోలింగ్‌.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.


logo