శుక్రవారం 03 జూలై 2020
National - Apr 30, 2020 , 09:56:53

వెహికల్ ట్యాక్స్‌లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వెహికల్ ట్యాక్స్‌లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం వెహికల్ ట్యాక్స్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది. అయితే ఏప్రిల్ 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి  ఉండ‌గా.. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌తో  ఆదాయం లేని కారణంగా ఈ నిర్ణయం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. వాస్త‌వానికి సక్రమంగా ట్యాక్స్ చెల్లించకపోతే 50 శాతం నుంచి 200 శాతం వరకూ జరిమానాలు విధిస్తారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యాగడువును పొడిగిస్తూ కొంచెం ఊరటను కల్పించింది. ట్యాక్ష్ చెల్లింపుల విషయంలో వెలుసుబాటును కల్పించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరడంతో  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


logo