శనివారం 30 మే 2020
National - May 19, 2020 , 14:58:48

ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం

ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జాగ్రత్తలతో ఆగస్టు 3న పాఠశాలలు పున:ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 

'స్కూళ్లలో 9 రకాల సదుపాయాలు కల్పించాలి. రూ.456 కోట్లు ఇప్పటికే విడుదల చేశాం. స్కూళ్లలో పనులు పూర్తికావాలంటే కలెక్టర్లు ప్రతిరోజు రివ్యూ చేయాలి.  15,715 పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టాలని' జగన్‌ పేర్కొన్నారు. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


logo