బుధవారం 08 జూలై 2020
National - May 02, 2020 , 16:17:16

ఏపీలో ఇంటికొక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు

ఏపీలో ఇంటికొక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు

అమ‌రావ‌తి: రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా రెడ్ జోన్ల‌లో ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని అధికారులు సూచించ‌డంతో.. శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

ఆ గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో రానున్నాయని అధికారులు చెప్పారు. ఇలా ఇంటికొక్క‌రికి ప‌రీక్ష‌లు చేయ‌డం ద్వారా ఆ ఇంట్లో ఏ ఒక్క‌రికి క‌రోనా ఉన్నా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, అన్ని ఇండ్ల‌లో ప‌రీక్ష‌లు పూర్త‌యితే ఇక కొత్త కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉండ‌ద‌ని ఏపీ అధికారులు భావిస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo