బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 15:10:03

వలస కూలీలను టికెట్లు అడగవద్దు: సీఎం జగన్‌

వలస కూలీలను టికెట్లు   అడగవద్దు: సీఎం జగన్‌

అమరావతి: కరోనా నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ నుంచి వెళ్తున్న వలసకూలీలపై ఉదారత చూపించాలని అధికారులను ఆదేశించారు. వలసకూలీల కోసం బస్సులు నడిపేందుకు సిద్ధం కావాలని సూచించారు. 

'బస్సుల్లో పాటించాల్సిన ప్రొటోకాల్స్‌ తయారు చేయాలి. రెస్టారెంట్లు, మాల్స్‌లో క్రమంగా తిరిగి కార్యకలాపాలు మొదలయ్యేలా ప్రణాళికలు తయారు చేయాలి. ఎండల్లో చిన్నారులతో కలిసి నడుస్తున్న కూలీలను చూసి చలించిపోయాను.  కూలీలను టికెట్లు కూడా అడగవద్దు. నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ కనిపించినా బస్సుల్లో ఎక్కించి సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకువెళ్లాలి. ప్రొటోకాల్స్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలసకూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణం కల్పించాలని' జగన్‌ అధికారులను ఆదేశించారు. 


logo