బుధవారం 27 మే 2020
National - May 19, 2020 , 13:49:56

అందుకే మీరే మా బలమని చెప్తున్నా: సీఎం జగన్‌

అందుకే మీరే మా బలమని చెప్తున్నా: సీఎం జగన్‌

అమరావతి: అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందన కార్యక్రమం, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్లతో  సమీక్షించారు. 

'నేను ప్రతిసారీ చెబుతున్నాను.. నా బలం కలెక్టర్లు, ఎస్పీలని, మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్నవారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను..అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కరోనా నివారణలో అందరూ అద్భుతంగా పనిచేశారు. నాలుగో విడత లాక్‌డౌన్‌లో ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాలి.  నాలుగో విడత లాక్‌డౌన్‌లో అనుసరిస్తున్న పద్ధతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది.  ఇందులో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వామ్యం కావాలన్నారు.

'వచ్చే మూడు రోజుల్లో ప్రజారవాణా ప్రారంభమవుతుంది. రాబోయే కాలంలో కరోనా సోకనివారు ఎవ్వరూ ఉండరేమో? ప్రజలు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా చూడాలి. కోవిడ్‌-19తో కలిసి జీవించాల్సి ఉంటుందని' సీఎం  పేర్కొన్నారు. 


logo