శనివారం 28 మార్చి 2020
National - Mar 25, 2020 , 19:38:19

కరోనాపై ఏపీ సీఎం జగన్‌ సమీక్షా సమావేశం

కరోనాపై ఏపీ సీఎం జగన్‌ సమీక్షా సమావేశం

అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా  రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాల్సిందిగా కోరారు. నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. వ్యాపారులు ఎవరైనా ఎక్కువ ధరలకు సరుకులు అమ్మితే 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.  నిత్యావసర వస్తువులు, రైతు బజార్లను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్లను వికేంద్రీకరణ చేయాలని ఆదేశించారు. ఒక వాహనంపై ఒక్కరే ప్రయాణించాలన్నారు. logo