మంగళవారం 31 మార్చి 2020
National - Mar 22, 2020 , 18:23:54

‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా ఏపీ సీఎం చప్పట్లు..

‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా ఏపీ సీఎం చప్పట్లు..

అమరావతి: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ‘జనతా కర్ఫ్యూ’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రజలంతా తమకు తాము స్వీయనిర్భంధంలో ఉండి, ప్రధాని పిలుపును పాటించారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రధాని తెలిపినట్లు యావత్‌ భారతావని చప్పట్లతో జనతాకర్ఫ్యూకు, వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం క్యాంపు ఆఫీసులో అధికారులతో కలిసి సరిగ్గా 5 గంటలకు చప్పట్లు కొట్టి జనతా కర్ఫ్యూకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌’ మహమ్మారి తరిమికొట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. వైరస్‌ను నివారించాలంటే స్వీయ నియంత్రణ అవసరమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జనం గుంపుగుంపులుగా ఉండకూడదని సీఎం పిలుపునిచ్చారు. 


logo
>>>>>>