బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 17:37:30

చంద్రబాబు జూమ్‌ సభలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు!

చంద్రబాబు జూమ్‌ సభలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు!

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో  10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. మంత్రి కన్నబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..రైతు భరోసాలో పేర్ల నమోదుకు మరో నెల రోజుల పాటు అవకాశం ఉంది. జూన్‌ 15 వరకు అర్హత ఉన్న రైతులు ధరఖాస్తు చేసుకోవచ్చు. మొక్కజొన్న, పసుపు, టమాట సహా అన్నింటినీ కొనుగోలు చేశాం. ఆర్‌బీకేల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు.

భవిష్యత్‌లో ఆర్‌బీకేలు కొనుగోలు కేంద్రాలుగా మారనున్నాయి. త్వరలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేస్తాం. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు జూమ్‌ సభలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేర్చారు.  కరోనా సమయంలోనూ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి పేర్కొన్నారు. 


logo