e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News చోక్సీ కిడ్నాప్‌కు ఆధారాల్లేవు.. అంటిగ్వా ప్ర‌ధాని ధ్రువీక‌ర‌ణ‌

చోక్సీ కిడ్నాప్‌కు ఆధారాల్లేవు.. అంటిగ్వా ప్ర‌ధాని ధ్రువీక‌ర‌ణ‌

చోక్సీ కిడ్నాప్‌కు ఆధారాల్లేవు.. అంటిగ్వా ప్ర‌ధాని ధ్రువీక‌ర‌ణ‌

న్యూఢిల్లీ: ప‌రారీలో ఉన్న ఆర్థిక నేర‌గాడు మెహుల్ చోక్సీ అప‌హ‌ర‌ణ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. అత‌డ్ని కిడ్నాప్ చేసిన‌ట్లు ఎటువంటి స‌రైన ఆధారాలు లేవ‌ని అంటిగ్వా- బార్బుడా ప్ర‌ధాని గాస్టోన్ బ్రౌనే తేల్చి చెప్పారు. దీంతో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభ‌కోణం ద‌ర్యాప్తు కోసం మెహుల్ చోక్సీని భార‌త్‌కు అప్ప‌గింత ప్ర‌క్రియ మెరుగ‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది.

అంటిగ్వా-బార్బుడా పార్ల‌మెంట్‌లో విప‌క్ష ఎంపీలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు గాస్టోన్ బ్రౌనే స‌మాధాన‌మిస్తూ.. స్కాట్లాండ్ యార్డ్ లేదా ఏదేనీ ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ‌లో కూడా చోక్సీని కిడ్నాప్ చేసిన‌ట్లు ఎటువంటి ఆధారాలు లేవ‌న్నారు. కానీ ప‌బ్లిక్ డొమైన్స్‌లో మాత్రం చౌక్సీని అప‌హ‌రించిన‌ట్లు ఉంద‌న్నారు.

- Advertisement -

గ‌త నెల‌లో అద్రుశ్య‌మైన చోక్సీని అరెస్ట్ చేసేందుకు అంటిగ్వా.. ఇంట‌ర్ పోల్ స‌హ‌కారం కోరింది. ఇంట‌ర్ పోల్ జారీ చేసిన ఎల్లో నోటీసుకు అనుగుణంగా డొమినికా పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. దీంతో త‌న‌ను కొంద‌రు కిడ్నాప్ చేశార‌నే వాద‌న‌ను చోక్సీ తీసుకొచ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement