మంగళవారం 31 మార్చి 2020
National - Feb 19, 2020 , 12:39:20

సీఏఏ, ఎన్ఆర్సీకి వ్య‌తిరేకంగా చెన్నైలో భారీ ర్యాలీ

సీఏఏ, ఎన్ఆర్సీకి వ్య‌తిరేకంగా చెన్నైలో భారీ ర్యాలీ

హైద‌రాబాద్‌:  పౌర‌సత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌ల‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు ముస్లిం సంఘాలు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌డుతున్నాయి. ఇవాళ చెన్నైలోని వాల‌జా రోడ్డు నుంచి రాష్ట్ర స‌చివాల‌యం వైపు భారీగా జ‌నం క‌దిలారు.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా తీర్మానం పాస్ చేయాల‌ని ఆందోళ‌న‌కారులు డిమాండ్ చేస్తున్నారు.  ఫెడ‌రేష‌న్ ఆఫ్ త‌మిళ‌నాడు ఇస్లామిక్ అండ్ పొలిటిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్స్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి.  అయితే ర్యాలీ నిర్వ‌హించ‌రాదు అంటూ మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ముస్లిం సంఘాలు వెన‌క్కిత‌గ్గ‌లేదు. ఫోర్ట్ సెయింట్ జార్జ్ రోడ్డు వైపుగా నిర‌స‌న‌కారులు ముందుకు వెళ్తున్నారు.  ముస్లింల ర్యాలీకి కొంద‌రు ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు తెలిపారు.  


logo
>>>>>>