శుక్రవారం 03 జూలై 2020
National - Jun 24, 2020 , 15:38:40

లంచమడిగితే ఫోన్‌ కొట్టండి..!

లంచమడిగితే ఫోన్‌ కొట్టండి..!

లక్నో : విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి పని చేసేందుకు లంచం డిమాండ్‌ చేస్తే, సదరు అధికారిపై ఫిర్యాదు చేసేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ బుధవారం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ శాఖల్లోని ఏ అధికారి పనులు చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తే ఫిర్యాదు చేయవచ్చని యూపీ విజిలెన్స్‌ డైరెక్టర్‌ పీవీ రామశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం గంటల వరకు ఎవరైనా 9454401866 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిబంధనల మేరకు పరిశీలించి, సదరు ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


logo