మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Jul 15, 2020 , 14:30:13

గోవాలో ఆగ‌స్టు 10 వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ

గోవాలో ఆగ‌స్టు 10 వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ

ప‌నాజి: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. కొత్త కేసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. దీంతో ప‌లు రాష్ట్రాలు క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. మ‌రికొన్ని రాష్ట్రాలు రాత్రి వేళ‌ల్లో క‌ర్ఫ్యూను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నాయి. తాజాగా గోవాలో సైతం ఆగ‌స్టు 10 వ‌రకు రాత్రిపూట‌ క‌ర్ఫ్యూ విధించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నేటి నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు ప్ర‌తిరోజు రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌నున్నట్లు గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. క‌ర్ఫ్యూ వేళ‌ల్లో వైద్య‌సేవ‌లు మిన‌హా మిగ‌తా అన్ని ర‌కాల సేవ‌ల‌పై నిషేధం ఉంటుంద‌ని గోవా సీఎం చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.