తృణమూల్‌కు మరో ఎమ్మెల్యే రాజీనామా

- 24 గంటల్లో పార్టీని వీడిన ముగ్గురు నేతలు
కోల్‌కతా, డిసెంబర్ 18: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అసమ్మతి పెరిగిపోతున్నది. ఆ పార్టీలో కీలక నేత, ఎమ్మెల్యే సువేందు అధికారి, మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారీ తృణమూల్‌కు రాజీనామా చేసిన 24 గంటల్లోపే మరో ఎమ్మెల్యే షీల్భద్ర దత్తా రాజీనామా చేశారు. సువేందు అధికారి రాజీనామా నిబంధనల ప్రకారం లేనందున ఆమోదించడం లేదని బెంగాల్ స్పీకర్ బిమన్ బెనర్జీ ప్రకటించారు.
బెంగాల్ అధికారులతో కేంద్రం భేటీ
పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఆరా తీశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్, డీజీపీ వీరేంద్రతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనపై చర్చించేందుకు గత సోమవారం ఢిల్లీకి రావాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కేంద్రం ఆదేశించింది. అయితే వాళ్లు ఆ భేటీకి హాజరుకాలేదు. దీంతో కేంద్ర హోంశాఖ తాజా సమావేశం నిర్వహిం చింది. ఇదిలా ఉండగా రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్ బెంగాల్ వచ్చారు.
తాజావార్తలు
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..