మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 13:38:39

మరోసారి భారత్‌-చైనా మధ్య కమాండర్‌ స్థాయి చర్చలు

మరోసారి భారత్‌-చైనా మధ్య కమాండర్‌ స్థాయి చర్చలు

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల నేపథ్యంలో ఈ వారంలో జరిగిన ఎనిమిదో రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. భారత బృందానికి లెప్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తూర్పు లడఖ్‌లోని వివాదస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను వెనక్కి తీసుకోవడం, సైనికుల ఉపసంహరణపై రోడ్ మ్యాప్ ఖరారు చేయడం వంటి వాటిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మరో రౌండ్‌ చర్చలుంటాయని కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఈ నెల 6న చుషుల్లో జరిగిన భారత్-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి ఎనిమిదో రౌండ్ సమావేశం ‘నిర్మాణాత్మకంగా ఉంది’.. కానీ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. త్వరలో మరో రౌండ్ సమావేశం నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని పేర్కొంది. సమస్యల పరిష్కారం, సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని ప్రకటనలో కేంద్రం తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.