గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 21:14:30

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదయింది. విజ‌య‌వాడ‌కు చెందిన 28 ఏండ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కి చేరింది. కాగా  ఈ నెల 18న స్వీడ‌న్ నుంచి వ‌చ్చిన అత‌డు ఢిల్లీ మీదుగా విజ‌య‌వాడ‌కు చేరుకున్నాడు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో విజ‌య‌వాడ జీజీహెచ్ లో చేరాడు. ఇదిలా ఉండ‌గా మ‌రో 23 మంది అనుమానితుల న‌మునాల‌ను ప‌రీక్షా కేంద్రాల‌కు పంపించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య‌ శాఖ ప్ర‌త్యేక బులిటెన్ విడుద‌ల చేసింది. logo
>>>>>>