శనివారం 16 జనవరి 2021
National - Dec 17, 2020 , 12:30:03

తృణ‌మూల్‌కు మ‌రో ఐదుగురు రాజీనామా

తృణ‌మూల్‌కు మ‌రో ఐదుగురు రాజీనామా

కోల్‌క‌తా : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ నాయ‌కుడు సువేంద‌రు అధికారి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. టీఎంసీలోని అసంతృప్త నాయ‌కులు ఒక్కొక్కరు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజాగా గోబింద‌పూర్ మ‌హేశ్‌పూర్‌, బామ‌న్‌గోలా, ప‌కువాహాట్, చందాపూర్ బ్లాక్‌ల అధ్య‌క్షులు తృణ‌మూల్ పార్టీకి రాజీనామా చేశారు. త‌మ రాజీనామా లేఖ‌ల‌ను  జిల్లా ప్రెసిడెంట్ మౌసం నూర్‌కు పంపారు. వీరంతా భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రికొంత మంది టీఎంసీని వీడే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.

మరోవైపు, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు తృణమూల్‌కు 100 కూడా రావని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ అన్నారు. తృణమూల్‌లో నంబర్‌ 2 నాయకుడిగా వెలిగిన ఆయన 2017లోనే బీజేపీలో చేరారు. బెంగాల్‌లో కనీసం 200 సీట్లు గెలవాలని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కోరుకుంటున్నారని కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పారు.