ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 22:00:28

ఛతీస్‌గఢ్‌లో మరో ఏనుగు మృతి

ఛతీస్‌గఢ్‌లో మరో ఏనుగు మృతి

రాయ్‌ఘడ్‌ : ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌ఘడ్‌ జిల్లా ధరమ్జాయ్‌గర్‌ బెహ్రామర్‌ గ్రామంలో గురువారం మరో ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రెండురోజుల క్రితం ఇదే జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. గత వారం క్రితం  సూరజ్‌పూర్‌ జిల్లాలోని ప్రతాప్‌పూర్‌ ప్రాంతంలో గర్భంతో ఉన్న ఏనుగుతో సహా మరొకటి మృత్యువాత పడ్డాయి. వరుసగా అసాధార రీతిలో ఏనుగల మృతి చెందుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 27న కేరళలోని పాలకడ్‌ జిల్లాలో పటాకులు కూర్చిన పైనాపిల్‌ తిని ఏనుగు మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న ఓ వ్యక్తిని ఇప్పటికే కేరళ అటవీశాఖ అధికారులు అరెస్టు చేసినట్లు  ఆ రాష్ట్ర మంత్రి కే రాజ్‌ తెలిపారు.logo