ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 08:56:04

పశ్చిమబెంగాల్‌లో విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృతి

పశ్చిమబెంగాల్‌లో విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృతి

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్‌గురి పరిధిలోని బామన్ దంగా టీ ఎస్టేట్ సమీపంలో విద్యుదాఘాతంతో ఏనుగు మృత్యువాత పడిన ఘటన వెలుగుచూసింది. ఖునియా అటవీ రేంజ్ పరిధిలో 25 ఏళ్ల వయసుగల మగ ఏనుగు విద్యుదాఘాతంతో మరణించింది. అటవీశాఖ అధికారులు ఏనుగు కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. పశ్చిమబెంగాల్‌లో గత రెండు నెలల్లో 4 ఏనుగులు మృత్యువాత పడ్డాయి.

ఏనుగులు పంటపొలాల్లోకి రాకుండా గ్రామస్తులు విద్యుత్ తీగలు అమర్చడంతో  4 ఏనుగులు మరణించాయి. ఏనుగు పండ్లు తినేందుకు వచ్చి విద్యుదాఘాతానికి గురై మరణించిందని స్థానిక పంచాయతీ సభ్యుడు లతిఫుల్ ఇస్లాం చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo