బుధవారం 08 జూలై 2020
National - Jun 24, 2020 , 09:31:13

వరుస భూకంపాలతో వణికిపోతున్న మిజోరం

వరుస భూకంపాలతో వణికిపోతున్న మిజోరం

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో వరస భూకంపాలతో వణికిపోతున్నది. రాష్ట్రంలో గత ఆదివారం నుంచి ప్రతిరోజు భూమి కంపిస్తున్నది. తాజాగా ఈరోజు ఉదయం 8 గంటల 2 నిమిషాలకు చాంపాయ్‌ సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.1గా నమోదయ్యింది. చాంపాయ్‌కి నైరుతి దిశలో 31 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. 

మిజోరంలో మంగళవారం కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.7గా ఉన్నదని పేర్కొంది. ఆది, సోమవారాల్లో 12 గంటల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. చాంపాయ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం 4గంటల 16 నిమిషాలకు 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4గంటల 10 నిమిషాలకు 5.3 తీవ్రతతో భూమి కంపించింది.


logo