శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 20:59:35

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో ఝలక్‌..!

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో ఝలక్‌..!

భోపాల్‌ : రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న వేళ.. పక్కనే మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. గత 12 రోజులో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఖాండ్వా జిల్లాలోని మంధాతా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యుడు నారాయణ్ పటేల్ (63)  సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రద్యుమ్న్ సింగ్ లోధి (52), సుమిత్రా దేవి కస్దేకర్ (36) రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, ఆ తర్వాత అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 

పార్టీలో చేరిన కొన్ని గంటల తర్వాత ఎంపీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియామకమయ్యారు. రాజీనామా చేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2018 డిసెంబర్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ మాట్లాడుతూ నారాయణ్ పటేల్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీ నుంచి తన పదవికి రాజీనామా చేశారు. ఒక రోజు సమయం తీసుకొని తుది నిర్ణయం చెప్పేందుకు సమయం ఇచ్చానని చెప్పానన్నారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఎవరి ప్రమేయం లేకుండా సంతోషంగా రాజీనామా చేస్తున్నానని గురువారం ధ్రువీకరించారని.. శర్మ ఎమ్మెల్యే సమక్షంలో ప్రకటన చేస్తూ మీడియాకు వీడియో విడుదల చేశారు.

అనంతరం నారాయణస్వామి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ మీడియా కోఆర్డినేటర్‌ నరేంద్ర సలూజ మాట్లాడుతూ ‘బీజేపీ ఎప్పుడూ తేడా ఉన్న పార్టీగా ఎవ్వరికీ తెలియదు. కానీ అసెంబ్లీ ఉప ఫలితాలు దాని నాయకులకు తెలుసుకాబట్టి, తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు గుర్రపు వ్యాపారం మురికి ఆటను బహిరంగంగా ఆడుతోంది. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, రాబోయే ఉప ఎన్నికలలో బీజేపీకి వారు తగిన సమాధానం ఇస్తారు’ అని అన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo