గురువారం 04 జూన్ 2020
National - May 09, 2020 , 10:53:52

మ‌రో డిఫాల్ట‌ర్ ప‌రారీ.. బ్యాంకుల‌కు 400 కోట్ల ఎగ‌వేత‌

మ‌రో డిఫాల్ట‌ర్ ప‌రారీ.. బ్యాంకుల‌కు 400 కోట్ల ఎగ‌వేత‌

హైద‌రాబాద్‌:  మ‌రో బ్యాంక్ డిఫాల్ట‌ర్ దేశం విడిచి వెళ్లాడు.  ఎస్బీఐతో పాటు ఇత‌ర బ్యాంకుల వ‌ద్ద‌ సుమారు 400 కోట్లు రుణం తీసుకున్న ఆ డిఫాల్ట‌ర్ ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఢిల్లీకి చెందిన బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తిదారులు రామ్‌దేవ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఓన‌ర్లు ఈ కేసులో డిఫాల్ట‌ర్లుగా ఉన్నారు. ఈ కేసును సీబీఐ విచారిస్తున్న‌ది.  మొత్తం ఆరు బ్యాంకుల నుంచి వాళ్లు రుణం తీసుకున్నారు. 2016 నుంచి ఆ డిఫాల్ట‌ర్లు మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు తేలింది.  2016లోనే  ఆ బ్యాంకును మొండి బాకీల కింద లిస్టు చేశారు. అయితే ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ఎస్బీఐ.. డిఫాల్ట‌ర్‌పై ఫిర్యాదు న‌మోదు చేసింది. అయితే సీబీఐ ఏప్రిల్ 28వ తేదీన కేసు బుక్ చేసింది.  

రామ్‌దేవ్ ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ సుమారు 411 కోట్లు రుణం తీసుకున్న‌ది. దాంట్లో 173.11 కోట్లు ఎస్బీఐ నుంచి,  76.09 కోట్ల కెన‌రా బ్యాంకు నుంచి, 64.31 కోట్లు యునియ‌న్ బ్యాంక్ నుంచి, 51.31 కోట్లు సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, 36.91 కోట్లు కార్పొరేష‌న్ బ్యాంకు నుంచి, 12.27 కోట్లు ఐడీబీఐ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  సీబీఐ ఫిర్యాదు మేర‌కు.. సీబీఐ ఆ కంపెనీ డైర‌క్ట‌ర్లు న‌రేశ్ కుమార్‌, సురేశ్ కుమార్‌, సంగీత‌, ఇత‌రుల‌పై కేసును న‌మోదు చేసింది. ఫోర్జ‌రీ, చీటింగ్ కేసుల‌ను సీబీఐ రిజిస్ట‌ర్ చేసింది. 


logo