ఆదివారం 31 మే 2020
National - May 17, 2020 , 19:59:57

ధారవిలో మరో 44 పాజిటివ్ కేసులు

ధారవిలో మరో 44 పాజిటివ్ కేసులు

ముంబై: ముంబైలోని ధార‌వి ఏరియాలో క‌రోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ధార‌వి స్లమ్ ఏరియాలో ఇవాళ కొత్త‌గా మరో 44 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటితో ధార‌వి ప్రాంతంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసులు 1242కు చేరుకున్నాయి.

ధార‌విలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 56 మంది మృతి చెందారని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వెల్ల‌డించింది. అతిపెద్ద స్ల‌మ్ ఏరియాగా పేరున్న ముంబైలోని ధార‌విలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కరోనా కేసుల సంఖ్య తీవ్రతరం అవుతుండటంతో ముంబై పోలీసులు ఇప్పటికే విధించిన 144 సెక్షన్ నేటి (మే17)తో ముగియనుంది.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo