ఆదివారం 07 జూన్ 2020
National - Apr 09, 2020 , 10:39:48

రూల్స్ బ్రేక్..మ‌రో 15 స్కూళ్ల‌కు నోటీసులు జారీ

రూల్స్ బ్రేక్..మ‌రో 15 స్కూళ్ల‌కు నోటీసులు జారీ

చండీగ‌ఢ్ : క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ అమ‌లు చేస్తుండ‌గా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థ‌లు ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. పంజాబ్ విద్యా శాఖ లాక్ డౌన్ కాలంలో ప్రైవేట్ విద్యాసంస్థ‌లు ఎలాంటి ఫీజులు వ‌సూలు చేయ‌డం లేద‌ని ఆదేశాలు జారీచేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఆదేశాలు లెక్క‌చేయ‌కుండా ఫీజులు వ‌సూలు చేస్తున్న మ‌రో 15 విద్యాసంస్థ‌ల‌కు విద్యాశాఖ నోటీసులు జారీచేసింది.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 38 నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 38 సంస్థ‌ల‌కు పంజాబ్ విద్యాశాఖ నోటీసులు జారీచేసింది. ఇటీవ‌లే 23 విద్యాసంస్థ‌ల‌కు నోటీసులు జారీ అయ్యాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo