బుధవారం 03 జూన్ 2020
National - Apr 06, 2020 , 10:31:57

ఏపీలో కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 266కు చేరాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు 14 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా కొత్తగా ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విశాఖపట్నంలో కొత్తగా 5 కేసులు నమోదు కాగా మొత్తం 20కి చేరుకున్నాయి. అనంతపపురం జిల్లాలో కొత్తగా మూడు కేసులు బయటపడగా మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా ముగ్గురికి పాజిటివ్‌ రాగా మొత్తం జిల్లాలో  కేసులు 56కు చేరుకున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ రోజు కొత్తగా రెండు కేసుల పాజిటివ్‌ రాగా, మొత్తం 32కు నమోదయ్యాయి. logo