మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 15:49:51

ఓఎన్‌జీసీలో 4,182 అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన

 ఓఎన్‌జీసీలో 4,182 అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన

ఢిల్లీ : ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా మొత్తం 4,182 అప్రెంటీస్‌ ఖాళీలున్నాయి. డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్థులు  అందుకు అర్హులు ఆయా ఖాళీలను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. 4182 అప్రెంటీస్‌ పోస్టులు ఉండగా వాటిలో ఏపీ కి చెందినవి 366 ఖాళీలు ఉన్నాయి.వీటి భర్తీ కోసం ప్రకటన విడుదలైంది. అర్హలైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ను బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు 17, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థుల వయసు ఆగస్టు 17, 2020 నాటికి 18-24 ఏండ్ల  మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు https://www.ongcindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. అర్హుల జాబితాను ఆగస్టు 24 న విడుదల చేయనున్నారు.


logo