బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 09:47:18

ఆన్‌లైన్‌లో జంతు విక్రయాలు..!

ఆన్‌లైన్‌లో జంతు విక్రయాలు..!

న్యూఢిల్లీ : ప్రపంచంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ అమ్మకాలదే హవా నడుస్తోంది. గుండు సూది నుంచి టీవీలు.. కంప్యూటర్ల దాక అన్ని ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. కొనుగోళ్లు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు మనకు కావాల్సిన వస్తువు  గుమ్మం ముందు వస్తుంది. ఇప్పటి వరకూ జంతు విక్రయాలు లేవు. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పడు అవి కూడా దొరుకుతున్నాయి. అవును.. మీరు ఆర్డర్ చేస్తే చాలు. గొర్రెలు, మేకలు కూడా మీ ఇంటి ముందుకు వస్తున్నాయి. ఈ నెల 31న బక్రీద్ ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మేకలు, గొర్రెలను విక్రయించేందుకు netlivestock.comను ప్రారంభించారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనం మార్కెట్‌కు వెళ్లేందుకు భయపడుతు నేపథ్యంలో అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ అలూమ్నీ సభ్యులు ఆన్‌లైన్‌లో గొర్రెల విక్రయానికి శ్రీకారం చుట్టారు. రైతులు, వినియోగదారులను అనుసంధానం చేస్తూ ‘‘నెట్ లైవ్ స్టాక్’’ను ప్రారంభించామని పీజీ విద్యార్థి ఖలీద్ రజా తెలిపారు.

ఆన్‌లైన్‌లో కొన్న మేకలు, గొర్రెలను వారి ఇంటికి డెలివరీ ఇచ్చేలా సహాయకులను నియమించామని చెప్పారు. కాగా ఆన్‌లైన్‌లో జంతు విక్రయాలను కొందరు వ్యతిరేకిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo