గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 15:56:53

ఈడీ స‌మ‌న్లు.. వాయిదా కోరిన అనిల్ అంబానీ

ఈడీ స‌మ‌న్లు.. వాయిదా కోరిన అనిల్ అంబానీ

హైద‌రాబాద్‌: మ‌నీల్యాండ‌రింగ్ కేసులో హాజ‌రు కావాలంటూ అనిల్ అంబానీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. అయితే ముంబైలోని ఈడీ ముందు హాజ‌రు అయ్యేందుకు మ‌రింత స‌మ‌యం కావాల‌ని రిల‌య‌న్స్ గ్రూపు చైర్మ‌న్ అనిల్ ఇవాళ వాయిదా ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు.  యెస్ బ్యాంకు స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు రానా క‌పూర్ కేసులో హాజ‌రు కావాలంటూ ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. రానా క‌పూర్‌తో కానీ, ఆయ‌న ఫ్యామిలీతో కానీ త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని గ‌త వార‌మే అనిల్ అంబానీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అనిల్‌కు చెందిన కంపెనీలు యెస్ బ్యాంకు నుంచి సుమారు 12వేల కోట్లు రుణం తీసుకున్నాయి. అనిల్‌, ఎస్సెల్‌, ఐఎల్ఎఫ్ఎస్‌, డీహెచ్ఎఫ్ఎల్‌, వోడాఫోన్ లాంటి సంస్థ‌లు యెస్ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న‌ట్లు ఇటీవ‌ల కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. మ‌నీలాండ‌రింగ్ కేసు కింద అనిల్ అంబానీ స్టేట్‌మెంట్ తీసుకోనున్న‌ట్లు తెలిసింది. యెస్ బ్యాంకు ఓన‌ర్ క‌పూర్ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్నారు. 


logo
>>>>>>